BJP: ఇవాళ సాయంత్రం బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసే ఛాన్స్

BJP: జేపీ నడ్డాతో జరిగే కోర్ కమిటీలో అభ్యర్థుల ఎంపికపై చర్చ

Jyothi
Published on: 19 Oct 2023 10:40 AM IST
This Evening is the chance to Release the First list of BJP Candidates
X

 BJP: ఇవాళ సాయంత్రం బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసే ఛాన్స్

BJP: బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తెలంగాణ బీజేపీ నేతలు హస్తిన పర్యటనకు వెళ్లారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. జేపీ నడ్డాతో జరిగే కోర్ కమిటీలో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇవాళ సాయంత్రం బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. మొదటి లిస్టులో దాదాపు 40 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. మహిళలకు, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్‌ కంటే ఎక్కువ సీట్లు.. బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలనుకుంటోంది బీజేపీ.

Jyothi

Jyothi

Next Story