Rain Alert: తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..

Rain Alert: గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం

Shekhar G
Published on: 25 July 2023 10:57 AM IST
There Is A Possibility Of Heavy Rains For The Next Three Days In Telangana
X

Rain Alert: తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..

Rain Alert: తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఇటు హైదరాబాద్‌‌లో నిన్న సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్ హిమాయత్‌సాగర్‌కు వదర ఉధృతి పెరుగుతోంది. కాసేపట్లో రెండు గేట్లు తెరవనున్నారు. మొత్తం 4 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story