ఏటీఎం లలో డబ్బులు ఉండవు..ఇబ్బందులు తప్పవు

మంగపేట మండలం కమలాపురం లోని ఎస్బీఐ, మంగపేట లోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం లలో డబ్బులు లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు.

S. Srikanth
Published on: 13 Dec 2019 12:29 PM IST
ఏటీఎం లలో డబ్బులు ఉండవు..ఇబ్బందులు తప్పవు
X

కమలాపురం: మంగపేట మండలం కమలాపురం లోని ఎస్బీఐ, మంగపేట లోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం లలో డబ్బులు లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి ఏటీఎం లలో సంబంధిత అధికారులు డబ్బులు పెట్టకపోవడంతో అవి తీర్చుకోవడం లేదు.

కమలాపురం లోని ఏటీఎం మద్యాహ్నం వరకు తెరుచుకొని ఆ తరువాత మూతపడుతుంది. ఇక మంగపేట లోని ఏటీఎం సిగ్నల్స్ లేకపోవడం, డబ్బులు లేకపోవడం వంటి సమస్యలతో వారంలో మూడు రోజులు కూడా తెరుచుకోవడం లేదు. దీంతో ప్రజలు అవసరాల నిమిత్తం ప్రైవేటు గా వ్యక్తుల వద్ద కమిషన్ చెల్లించి డబ్బులు తీసుకుంటున్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story