‌Hyderabad: భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య

‌Hyderabad: భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య

Sandeep Eggoju
Updated on: 5 Dec 2021 12:21 PM IST
The Wife Self Distraction Because she did not Like the Blouse Sewn by her Husband
X

భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్ర్య

Hyderabad: హైదరాబాద్ అంబర్‌పేట్‌లో విషాదం చోటు చేసుకుంది. భర్త కుట్టిన బ్లౌజ్‌ నచ్చలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అంబర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శ్రీనివాసులు, విజయలక్ష్మి దంపతులు గోల్నాక తిరుమలనగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే శ్రీనివాస్‌ ఇంట్లో టైలర్‌ పనితో పాటు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ చీరలు విక్రయిస్తుంటాడు. ఇందులో భాగంగా భార్య కోసం జాకెట్‌ను కుట్టాడు భర్త. అయితే ఆది నచ్చలేదని భార్య చెప్పడంతో శ్రీనివాస్‌‌కు, విజయలక్ష్మీకి మధ్య వాగ్వాదం చోటు చేసుంది. దీంతో మనస్థాపానికి గురైన భార్య విజయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story