Naga Shaurya Farm House: గుత్తా సుమన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Naga Shaurya Farm House: గుత్తా సుమన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

Arun Chilukuri
Published on: 3 Nov 2021 10:47 AM IST
The Trap Tightening Around the Gutta Suman in Casino Game Case
X

Naga Shaurya Farm House: గుత్తా సుమన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Naga Shaurya Farm House: గుత్తా సుమన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తవ్వేకొద్దీ గుత్తా సుమన్ ఆగడాలు బయటపడుతున్నాయి. హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో గుత్తా సుమన్ పేకాట స్థావరం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ఆదివారం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీ క్యాసినో నిర్వాహకులతో పరిచయాలు, పేకాట ఈవెంట్ కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికలు, మద్యం సరఫరా, అమ్మాయిల సహాయంతో ఈవెంట్ నిర్వహణ వంటివి చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.

ఒక సిట్టింగ్‌కు 25 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసినట్లు తేలింది. ఇక నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు అద్దెకు తీసుకొని స్థావరం ఏర్పాటు చేసి క్యాసినో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో 29 మందికి బెయిల్ మంజూరు చేసిన ఉప్పర్‌పల్లి కోర్టు గుత్తా సుమన్‌ను పోలీస్‌ కస్టడీకి అనుమతిచ్చింది. ఇవాళ గుత్తా సుమన్‌ను చర్లపల్లి జైల్ నుంచి కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story