అన్ని వర్గాల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది

దేశంలో ఎక్కడా లేని విదంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిరాని అన్నారు.

S. Srikanth
Published on: 7 Feb 2020 5:52 PM IST
అన్ని వర్గాల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది
X

ఆసిఫాబాద్: దేశంలో ఎక్కడా లేని విదంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిరాని అన్నారు. కుంరం భీం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్ లో బ్రహ్మణ సంక్షేమ పథకాల పై అవగాహన సదస్సు మరియు లబ్ది దారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిదులుగా శ్రీ వేణుగోపాలచారి గారు, శ్రీమతి జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మీ గారు, ఎమ్మెల్సీ శ్రీ పురాణం సతీష్ గారు, ఆసిఫాబాద్ శాసనసభ్యులు శ్రీ ఆత్రం సక్కు గారు, సిర్పూర్ శాసనసభ్యులు శ్రీ కోనేరు కోనప్ప గారు, చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిదులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారు ప్రజా సంక్షేమమే ద్యేయంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు,కుల వృత్తుల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని,రైతుల సంక్షేమం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. రైతుబంధు,రైతు బీమా, సకాలంలో ఎరువుల పంపిణీ, నాణ్యమైన విద్యుత్తు 24 గంటలు సరఫరా ఇలా అన్ని రకాల పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story