KTR: కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేల హక్కులు కాలరాస్తున్నారు

KTR: అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదు-

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 16 July 2024 9:15 PM IST
Revanth Reddy is cheating in the name of loan waiver KTRs sensational comments
X

KTR On Runamafi: రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్నారు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా కొత్త సంస్కృతిని తీసుకు వచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కావాలనే విపక్ష ఎమ్మెల్యేల హక్కులకు భంగం కల్గిస్తున్నారని మాజీ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఆక్షేపించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై అసెంబ్లీ స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ప్రతి సందర్భంలోనూ ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఓడిపోయిన నేతలను భాగస్వామ్యం చేస్తూ ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శాసనసభ్యుల హక్కుల రక్షణ విషయంలో స్పీకర్ అధికారాలను వినియోగించి చర్యలు తీసుకోవాలని కోరారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story