TS BJP: టీబీజేపీ అభ్యర్థుల ప్రకటనపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

TS BJP: తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ అభ్యర్థులపై కూడా చర్చ

Shekhar G
Updated on: 21 Oct 2023 1:45 PM IST
The Ongoing Deadlock Over The Declaration Of  Telangana BJP Candidates List
X

TS BJP: టీబీజేపీ అభ్యర్థుల ప్రకటనపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

TS BJP: ఇవాళ తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఫస్ట్‌లిస్ట్‌ను కమలం పార్టీ ప్రకటించే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన నిన్న రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాదాపు 2 గంటల పాటు కసరత్తు చేసిన తర్వాత.. ఇవాళ తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. గోషామహల్ నియోజకవర్గంపై ఉత్కంఠ వీడింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకుంది. ఢిల్లీలో ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన బీజేపీ సీఈసీ మీటింగ్‌కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, లక్ష్మణ్, డీకే అరుణ హాజరయ్యారు.

Shekhar G

Shekhar G

Next Story