VC Sajjanar: ఆర్టీసీ విలీనం చారిత్రక నిర్ణయం.. 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం

VC Sajjanar: ఆర్టీసీ విలీనం హర్షణీయమని ఎండి సజ్జనార్ ట్వీట్

Shekhar G
Published on: 1 Aug 2023 7:11 AM IST
The Merger Of RTC Is Historic Decision Says VC Sajjanar
X

VC Sajjanar: ఆర్టీసీ విలీనం చారిత్రక నిర్ణయం.. 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం

VC Sajjanar: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ అభిప్రాయం వ్యక్తంచేశారు. 43 వేల మంది ఆర్టీసీ సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇదని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పనిచేస్తోన్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ గారికి‌ ప్రత్యేక ధన్యవాదాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణలో మరింతగా ప్రజలకు చేరువ చేస్తారనే అభిప్రాయం వ్యక్తంచేశారు.


Shekhar G

Shekhar G

Next Story