Jagtial: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్య

MLC Jeevan Reddy: జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో కాంగ్రెస్ నాయకుడు దారుణహత్యకు గురయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 Oct 2024 10:21 AM IST
Main Follower of MLC Jeevan Reddy was Brutally Murdered
X

Jagtial: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్య

MLC Jeevan Reddy: జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో కాంగ్రెస్ నాయకుడు దారుణహత్యకు గురయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మరు గంగారెడ్డిని బైక్‌పై వెళ్తుండగా అతి దారుణంగా హత్య చేశారు. రాజకీయ కక్షలతోనే గంగారెడ్డిని హత్య చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హత్యకు నిరసనగా కార్యకర్తలతో కలిసి జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించారు.

జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా అని పోలీసులపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ తమ నేతలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారని ఆరోపించారు జీవన్ రెడ్డి. గతంలో డయల్ 100 ఫోన్ చేసి గంగారెడ్డి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అప్పుడే చర్యలు తీసుకుంటే ఈ దారణం జరిగేది కాదన్నారు జీవన్ రెడ్డి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story