రేపు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల

BJP: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టుపై కసరత్తు

Jyothi
Published on: 18 Oct 2023 11:52 AM IST
The first list of Telangana BJP MLA Candidates will be Released Tomorrow
X

రేపు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల

BJP: ఢిల్లీలో సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. రేపు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదలకై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ లక్ష్మణ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రకాష్‌ జవదేకర్, సునీల్ బన్సల్ ఢిల్లీ చేరుకున్నారు. 40 మందితో తొలి బాబితా ప్రకటనకు బీజేపీ కసరత్తు చేస్తోంది. టికెట్ల కేటాయింపులో మహిళలకు..బీసీలకు ప్రాధాన్యతనివ్వాలని కమలం పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రతి బీసీ కులానికి ఒక సీటు ఇచ్చేలా ప్లాన్ వేసింది. బీసీల్లో మున్నూరుకాపుతో పాటు ముదిరాజ్ కులాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని నిర్ణయించిన బీజేపీ...బీసీ కార్డ్‌తో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది.

Jyothi

Jyothi

Next Story