Jagadish Reddy: రాష్ట్రం మొత్తం విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేటు చేతిలోకి వెళ్ళింది
Jagadish Reddy: పైలెట్ ప్రాజెక్టుగా ఇది పాతబస్తీకే పరిమితం కాదు
Jagadish Reddy: రాష్ట్రం మొత్తం విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేటు చేతిలోకి వెళ్ళింది
Jagadish Reddy: విద్యుత్ బిల్లుల వసూలును అదానీకి అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతుందని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఇది పాతబస్తీకే పరిమితం కాదన్నారు. రాష్ట్రం మొత్తం విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేటు చేతిలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంటు ఇక రాష్ట్రంలో వుండదని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారని అనుమానం వ్యక్తం చేశారు మాజీమంత్రి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చినా విద్యుత్ రంగాన్ని ప్రయివేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని కేసీఆర్ అంగీకరించలేదన్నారు జగదీష్ రెడ్డి.
Next Story




