Marripadu: వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఏఎస్ డబ్ల్యూఓ బ్రహ్మానంద చారి

బాలుర వసతి గృహాన్ని ఏ ఎస్ డబ్ల్యూ ఓ బ్రహ్మానంద చారి పరిశీలించారు.

admin1
Updated on: 11 March 2020 3:37 PM IST
Marripadu: వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఏఎస్ డబ్ల్యూఓ బ్రహ్మానంద చారి
X

మర్రిపాడు: బాలుర వసతి గృహాన్ని ఏ ఎస్ డబ్ల్యూ ఓ బ్రహ్మానంద చారి పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థులకు అందజేసే భోజనం మేనును పరిశీలించినట్లు ఆయన తెలిపారు. పదవ తరగతి విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలను పరిశీలించారు. వసతి గృహంలోని విద్యార్థులకు జరుగుతున్న స్టడీ క్లాసులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వసతి గృహాల్లో పదవ తరగతి విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని ఉద్దేశంతోనే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బాలుర వసతి గృహంలో రాత్రి బస చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వార్డెన్ అంకయ్య, హై స్కూల్ ఉపాధ్యాయులు గోపి తదితరులు ఉన్నారు.



admin1

admin1

Next Story