TGPSC Chairman Post: టీజీపీఎస్సీ చైర్మన్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల
Notification For TGPSC Chairman Post: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3వ తేదీతో ముగిసిపోనున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు ఘంట చక్రపాణి, బి జనార్ధన్ రెడ్డి టీజీపీఎస్సీ పూర్తి స్థాయి చైర్మన్లుగా పని చేశారు. మధ్యలో డి కృష్ణా రెడ్డి, ప్రొ సాయిలు యాక్టింగ్ చైర్మన్లుగా కొనసాగారు.
Next Story




