TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్... లింక్ ఇదిగో

TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్... లింక్ ఇదిగో
x
Highlights

TG Inter results date and time: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు వెల్లడికి తేదీ ఫిక్స్ అయింది. ఇంటర్ పై చదువుల కోసం పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు...

TG Inter results date and time: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు వెల్లడికి తేదీ ఫిక్స్ అయింది. ఇంటర్ పై చదువుల కోసం పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది.

ఏప్రిల్ 22న మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాల వెల్లడించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. అదే రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. భట్టితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ www.tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లేదా bse.telangana.gov.in లోకి లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు అని కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే ఫలితాల డైరెక్ట్ లింక్ కూడా ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories