రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భానుడి భగభగలు..

Teriffic Climate Change in Telangana
x

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భానుడి భగభగలు..

Highlights

Wheather Update: ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలు

Wheather Update: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండలు మండనున్నాయి. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. దేశంలోని వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండటంతోపాటు పొడి వాతావరణం నెలకొనడమే దీనికి కారణమని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. మరోవైపు జూన్‌ ఒకటో తేదీ నుంచి అయిదు రోజులపాటు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను కూడా తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం నల్గొండ జిల్లా దామరచర్లలో గరిష్ఠంగా 44.3 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories