తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత... బీఆర్ఎస్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు కాంగ్రెస్ యత్నం

కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 30 Sept 2024 7:04 PM IST
Tension near Hyderabad Telangana Bhavan
X

తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత... బీఆర్ఎస్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు కాంగ్రెస్ యత్నం

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు కాంగ్రెస్‌ చేనేత కార్మిక విభాగం నాయకులు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

దుబ్బాకలో జరిగిన సమావేశంలో కొండా సురేఖను బీఆర్ఎస్ శ్రేణులు అవమానించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సోషల్ మీడియాలో కొండా సురేఖపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మరోసారి అవమానించేలా మాట్లాడితే బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ముందు దిష్టిబొమ్మలు దహనం చేస్తామని హెచ్చరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story