Bandi Sanjay: అరెస్ట్ చేసి... నా పాదయాత్రను అడ్డుకోలేరు

Bandi Sanjay: జనగామ జిల్లా పాములూరులో ఉద్రిక్తత

Jyothi
Published on: 23 Aug 2022 1:09 PM IST
Tension in Pamuluru of Jangaon District
X

Bandi Sanjay: అరెస్ట్ చేసి... నా పాదయాత్రను అడ్డుకోలేరు

Bandi Sanjay: జనగామ జిల్లా పాములూరులో టీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలు చేత పట్టుకుని బండి సంజయ్ దీక్షాశిబిరం వైపు భారీగా వెళ్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ ఫ్లెక్సీలను చించి వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాములూరు, ఉప్పుగల్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.

బండి సంజయ్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్టు చేయడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు దీక్షాశిబిరం దగ్గర నిరసనకు దిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు, పాములూరు, ఉప్పుగల్ నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలు చేత పట్టుకుని దీక్షాశిబిరం వైపు దూసుకొచ్చారు. బీజేపీ కార్యకర్తలకు పోటీగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పాములూరులో ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ కార్యకర్తలు.. బీజేపీ ఫ్లెక్సీలకు నిప్పుపెట్టారు. ఈ ఆందోళనలో ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇరు పార్టీల కార్యకర్తల ఆందోళనతో.. పాములూరు, ఉప్పుగల్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.

తనను అరెస్ట్ చేసినా.. పాదయాత్రను అడ్డుకోలేరన్నారు బండి సంజయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర చేసి తీరుతానంటున్నారు. అడ్డంకులు, అవరోధాలు సృష్టించినా.. పాదయాత్ర జరిగి తీరుతుందన్నారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం భద్రకాళి అమ్మవారి పాదాల చెంత పాదయాత్ర ముగిస్తానన్నారు ఎంపీ బండి సంజయ్.

Jyothi

Jyothi

Next Story