Shamshabad: వేణుగోపాలస్వామి దేవాలయం వద్ద ఉద్రిక్తత.. దేవాదాయశా‌ఖ భూముల నుంచి తమ విల్లాలకు రోడ్డువేసే ప్రయత్నం

Shamshabad: రాత్రికి రాత్రి దేవాదాయశాఖ భూమిలో రోడ్డు వేసేందుకు కీర్తి విల్లాస్ యాజమాన్యం ప్రయత్నం

Shekhar G
Published on: 5 Aug 2023 6:51 PM IST
Tension At Manchirevula Venugopala Swamy Temple In Shamshabad
X

Shamshabad: వేణుగోపాలస్వామి దేవాలయం వద్ద ఉద్రిక్తత.. దేవాదాయశా‌ఖ భూముల నుంచి తమ విల్లాలకు రోడ్డువేసే ప్రయత్నం

Shamshabad: శంషాబాద్‌ మంచిరేవులలోని వేణుగోపాలస్వామి దేవాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాత్రికి రాత్రి దేవాదాయశాఖ భూమిలో కీర్తి విల్లాస్ యాజమాన్యం రోడ్డు వేయడానికి సిద్ధమైంది. వేణుగోపాల స్వామి దేవాలయానికి చెందిన భూమి సర్వే నంబర్ 303లో 16 ఎకరాల ఒక గుంట స్థలము ఉంది. అయితే.. రాత్రికి రాత్రే ఓ బిల్డర్ స్థానిక మున్సిపాలిటీ అధికారులతో కుమ్మక్కై.. దేవాదాయ భూముల నుంచి తమ విల్లాలకు రోడ్డు వేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న దేవాదాయశాఖ అధికారులు.. సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై రియల్టర్లు చిందులు తొక్కారు. దీంతో.. రియల్టర్లు, దేవాదాయశాఖ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Shekhar G

Shekhar G

Next Story