Hyderabad: హైదరాబాద్ చిక్కడపల్లిలోని హెబ్రోన్ చర్చ్ వద్ద ఉద్రిక్తత

Hyderabad: సొసైటీ సభ్యులు, ట్రస్టు సభ్యుల మధ్య ఘర్షణ, కొంతకాలంగా చర్చిపై ఆధిపత్యానికి ఇరువర్గాల మధ్య పోరు.

Sriveni Erugu
Published on: 18 Feb 2022 2:19 PM IST
Tension at Hebron Church in Chikkadpally  Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ చిక్కడపల్లిలోని హెబ్రోన్ చర్చ్ వద్ద ఉద్రిక్తత

Hyderabad: హైదరాబాద్ చిక్కడపల్లిలోని హెబ్రోన్ చర్చ్ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. సొసైటీ, ట్రస్టు సభ్యుల మధ్య ఘర్షణ నెలకొంది. కొంతకాలంగా చర్చిపై ఆధిపత్యానికి ఇరువర్గాల మధ్య పోరు సాగుతోంది. సొసైటీ సభ్యులు బౌన్సర్లను పెట్టి చర్చ్‌ను స్వాధీనం చేసుకుని, తమను ప్రార్థనలకు అనుమతించడంలేదని ట్రస్ట్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇవాళ ప్రార్థనలు చేస్తామంటు.. చర్చ్ వద్దకు ట్రస్టు సభ్యులు చేరుకున్నారు. ట్రస్ట్ సభ్యులను లోపలికి అనుమతించకుండా గేటుకు తాళాలు వేశారు సొసైటీ సభ్యులు. గేటు బద్దలు కొట్టి హేబ్రోన్ చర్చ్ లోపలికి ట్రస్ట్ సభ్యులు వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. చర్చ్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story