తెలంగాణలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు..75ఏళ్ల వ్యక్తి కోలుకున్నారు: మంత్రి ఈటల

తెలంగాణలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు..75ఏళ్ల వ్యక్తి కోలుకున్నారు: మంత్రి ఈటల
x
Etela Rajendar(File Photo)
Highlights

తెలంగాణ‌లో కొత్త‌గా మ‌రో ప‌ది పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేందర్ వెల్ల‌డించారు.

తెలంగాణ‌లో కొత్త‌గా మ‌రో ప‌ది పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేందర్ వెల్ల‌డించారు. గ‌డిచిన 24గంట‌ల్లో 34 మంది డిశార్చ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రానా బారినుంచి 720 మంది కోలుకుని డిశార్జ్ కాగా...గాంధీ ఆసుప‌త్రిలో 376 మంది చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల‌తో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ రాష్ట్రంలో 1,132 చేరింది. కోవిడ్ కేసులు ఎక్కువ‌గా ఉన్న జీహెచఎంసీ ప‌రిధీలోనే క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్యుల చేప‌ట్టాని సీఎం ఆదేశాలు ఇచ్చార‌ని మంత్రి తెలిపారు.

ఈసంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి ఈట‌ల రాజేందర్ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 9 జిల్లాలు గ్రీన్ జోన్ ప‌రిథిలో ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. రాష్ట్ట్రంలో మ‌రో 14 జిల్లాల‌ను గ్రీన్ జోనులో చేర్చ‌ల‌ని కేంద్రాన్ని కోరిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో క‌రోనా టెస్టులు చేయ‌డంలేద‌నే ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌న్నారు. 75 ఏళ్లు దాటిన వ్య‌క్తి కూడా కొలుకొని డిశార్జ్ అవుతున్నార‌ని మంత్రి వివ‌రించారు. గాంధీ ఆసుప‌త్రి వైద్యులు పనితీరు అద్భుతంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. ప్రతి రోజు సీఎం కేసీఆర్ వీడియో కాన్పిరేన్స్ ద్వారా ప‌ర్య‌వేక్షిస్తున్నారని తెలిపారు. సీఎం చెప్పినట్లుగానే 29 వ‌ర‌కు లాక్ డౌన్ ఉంటుద‌ని మ‌రోసారి స్ష‌ష్టం చేశారు. హైద‌రాబాబద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాలు మాత్ర‌మే రెడ్ జోన్ ప‌రిధిలో ఉన్నాయ‌ని మంత్రి చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories