KCR: కేసీఆర్‌ మీటింగ్‌కు ఆ ఎమ్మెల్యే డుమ్మా.. జంపింగ్‌ కన్‌ఫర్మ్..?

KCR: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాల్లో.. భద్రాచలంలో మాత్రమే గెలిచిన బీఆర్ఎస్

Shekhar G
Updated on: 4 March 2024 4:04 PM IST
Tellam Venkata Rao Skipped KCR BRS Parliamentary Review Meeting
X

KCR: కేసీఆర్‌ మీటింగ్‌కు ఆ ఎమ్మెల్యే డుమ్మా.. జంపింగ్‌ కన్‌ఫర్మ్..?

KCR: బీఆర్ఎస్ పార్టీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. నిన్న కుటుంబసమేతంగా సీఎం రేవంత్‌ని కలిసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. కాంగ్రెస్‌లో చేరేందుకు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన మహబూబాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి తెల్లం వెంకట్రావు డుమ్మా కొట్టారు. దీంతో కాంగ్రెస్‌లో తెల్లం చేరిక ఖరారైనట్టు టాక్ వినిపిస్తోంది.

కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌కు తెల్లం వెంకట్రావు సన్నిహితుడు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెల్లం బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్‌ విజయం సాధించింది. ఇక తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో భద్రాచలం బీఆర్ఎస్ నేతలతో మాజీమంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు.

Shekhar G

Shekhar G

Next Story