గులాబీ నేతలతో కేసీఆర్ మీట్..టార్గెట్ గ్రేటరేనా?

Arun Chilukuri
Updated on: 17 Nov 2020 4:30 PM IST
గులాబీ నేతలతో కేసీఆర్ మీట్..టార్గెట్ గ్రేటరేనా?
X

రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంకానుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాలని ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకొని సమావేశానికి తీసుకురావాలని కోరారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతంలో కంటే అధిక స్థానాలను టీఆర్ఎస్‌ కైవసం చేసుకుంటుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధే తమ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తమకు పోటీయే కాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story