తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సీఎస్ సమీక్ష

TS Formation Day: జూన్ 2న తెలంగాణ అవతరణ వేడుకలు-సీఎస్ సోమేష్ కుమార్

Jyothi
Published on: 29 May 2022 7:00 AM IST
Telangana To Celebrate State Formation Day On June 2
X

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సీఎస్ సమీక్ష

TS Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సీఎస్ సోమేష్ కుమార్ అధికారులో సమీక్ష నిర్వహించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ర్ట అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులకు నివాళులర్పిస్తారని తెలిపారు. ఆ తర్వాత పబ్లిక్ కాంగ్రెస్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసి.. పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారని చెప్పారు. అదే రోజు సాయంత్రం రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం ఉంటుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. 2 సంవత్సరాలపాటు కరోనా వల్ల ఘనంగా నిర్వహించక పోయినా ప్రభుత్వం ఈసారి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక అవతరణ ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి సి.ఎస్. సోమేశ్ కుమార్ ఇదివరకే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తాజాగా పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాట్లపై సి.ఎస్ సమీక్షతో పాటు పరిశీలించారు.

Jyothi

Jyothi

Next Story