Coronavirus: తెలంగాణలో పదో తరగతి పరీక్షల వాయిదా!
Telangana High Court (file photo)
కరోన వైరస్ ఎఫెక్ట్ తెలంగాణా పదోతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. నిన్ననే (మార్చి 19) న ప్రాంభమైన పరీక్షలు యధాతథంగా జరుగుతాయని ప్రభుత్వం చెప్పింది. అయితే, ఈ పరీక్షలపై ఒక వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం వేశారు. దీనిని పరిశీలించిన కోర్టు పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ఈరోజు (మార్చి 20) ప్రకటించింది.
రేపటి పరీక్ష యధాతథంగా జరుగుతుంది. సోమవారం (మార్చి 23) నుంచి ఈ నెల 30 వారకూ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ ఆరు వరకూ జరగాల్సిన పరీక్షలు అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు.
Next Story




