Students Protest : హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద విద్యార్థుల ఆందోళన

Students Protest : హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద విద్యార్థుల ఆందోళన
x
Highlights

Students Protest : హైదరాబాద్ కూకట్‌పల్లి JNTU వద్ద ఉధ్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో పరీక్షలు నిర్వహించడంపై...

Students Protest : హైదరాబాద్ కూకట్‌పల్లి JNTU వద్ద ఉధ్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. బీటెక్ మొదటి రెండవ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు అనుమతించాలని ధర్నా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశాయి. అంతే కాక విద్యార్ధులు చెల్లించే ఫీజులో 50 % మాఫీ చేయాలని కోరారు. ఈ క్రమంలోనే జెఎన్టీయు ప్రధాన గేటు ముందు ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్ధులను చెదరగొట్టే ప్రయత్నం చేసారు. దీంతో విద్యార్ధులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ప్రవేశ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అంతే కాక కరోనా కాణంగా పరీక్షలకు హాజరు కాని విద్యార్ధులకు మరో సారి పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. మరి కొంత మంది విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే వారిని పై తరగతులకు ప్రమోట్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories