ఆన్లైన్ క్లాసులు.. తల్లిదండ్రుల జేబులకు చిల్లులు!!

ఆన్లైన్ క్లాసులు.. తల్లిదండ్రుల జేబులకు చిల్లులు!!
x
Highlights

కరోనా రాకతో స్కూళ్ళన్ని మూసివేయండంతో, విద్యార్ధులు అంతా ఇంటికి పరిమితం అయ్యారు. ఇక ఆన్ లైన్ క్లాసులను నమ్ముకున్న తల్లిదండ్రుల పరిస్థితి అగమ్య గోచరంగా...

కరోనా రాకతో స్కూళ్ళన్ని మూసివేయండంతో, విద్యార్ధులు అంతా ఇంటికి పరిమితం అయ్యారు. ఇక ఆన్ లైన్ క్లాసులను నమ్ముకున్న తల్లిదండ్రుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. క్లాసులకోసం ఉపయోగిస్తున్న నెట్ బ్యాలేన్స్ లు పదివేల రూపాయాలకు పైగానే వస్తుండటంతో పేరంట్స్ తలలు పట్టుకుంటున్నారు.

ప్రస్తుతం విద్యార్ధులు స్మార్ట్‌ఫోన్‌ నుంచి జూమ్‌, గూగుల్‌ క్లాస్‌రూమ్‌ వంటి మాధ్యమాల ద్వారా వర్చువల్‌గా తరగతులకు హాజరవుతున్నారు. పిల్లలు ఆన్‌లైన్‌ తరగతులకు ఉపయోగిస్తున్న మొబైల్‌ ఫోన్ల బిల్లులు చూసి తల్లిదండ్రులు కంగుతింటున్నారు. రెండుమూడు నెలలుగా 10 వేలకు మించి బిల్లులు వస్తున్నాయంటు ఆదోళన చెందుతున్నారు. ఓ వైపు ఆన్ లైన్ తరగతులు 2 గంటలు కంటీన్యూగా నిర్వహిస్తుండటంతో, మొబైల్ డేటా అధికంగా ఉపయోగించాల్సి వస్తుందని చెబుతున్నారు దీంతో రీచార్జ్లులు అధికంగా చేయించాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే, మరింత డేటా యూజ్ చేయాల్సి వస్తుందంటున్నారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు క్లాసులతో సరిపెట్ట కుండా, స్టడీ అవర్స్ పేరుతో మరో రెండు మూడు గంటలు క్లాసులు పెంచడంతో ఎకంగా ఒక్క రోజే 32 జీబీ అంతకంటే ఎక్కువ మొబైల్ డేటాను వినియోగించాల్సి వస్తుందని, ఇక ప్రతి నెల బిల్లు 10 వేలు నుండి 20 వేల రూపాయాల వరకు వస్తుందంటు తల్లి దండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇక స్కూల్ ఫీజుల విషయంలో ప్రైవేటు యాజమాన్యాలు ఏమాత్రం తగ్గడం లేదు కరోనా ముందు ఎంతైతే ఫీజులు ఉన్నాయో అదే స్థాయిలో్ ఆన్ లైన్ క్లాసులకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక వేల ఫీజులు సమయానికి చెల్లించక పోతే ఆన్ లైన్ క్లాసుల నుండి పిల్లలను తొలగిస్తున్నారని, దీంతో స్కూల్స్ కి పరుగులు పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు.

వీటితో పాటు తల్లిదండ్రులకు మరో కష్టం వచ్చి పడింది. పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్లు పడిన తర్వాత ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడ్డారు. కొన్ని గేమ్స్ ఉచితంగా లభిస్తుండగా, మరికొన్ని పెయిడ్ గేమ్స్ ఉన్నాయి. తెలిసీ తెలీక పిల్లలు ఆప్షన్స్ వత్తడంతో బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు విత్ డ్రా అయిపోతోంది. నాన్‌ గూగుల్‌ డేటా పేరుతో టెలికాం ఆపరేటర్లు జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఇలా నెలకు ఒక్కోసారి 23 వేలు బిల్లు చెల్లించే పరిస్థితి కూడా ఏర్పడిందని పేరెంట్స్ అంటున్నారు.

ఓవైపు కరోనా కరణంగా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న తల్లిదండ్రులకు, అధిక స్కూల్ ఫీజులు, ఆన్ లైన్ విద్య కోసం మొబైల్ డాటా వినయోగం తలకు మించిన భారంగా తయారవుతుంది. ఇక మళ్ళీ తిరిగి స్కూల్స్ ప్రారంభం అయితే తప్పా, తాము ఈ ఇబ్బందుల నుండి బయట పడే అవకాశం కనిపించడం లేదని తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories