మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!

మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!
x
Highlights

Bars And Clubs : మద్యం ప్రియులకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా బార్లు, క్లబ్బులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది

Bars And Clubs : మద్యం ప్రియులకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా బార్లు, క్లబ్బులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అయితే పర్మిట్ రూమ్‌లకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. అలాగే బార్లు, క్లబ్ లలో మ్యూజికల్ ఈవెంట్స్, డ్యాన్స్ లకు అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తున్నట్టు ఆర్డర్ కాపీలో ప్రభుత్వం పేర్కొన్నది. కరోనా నిబంధనలని కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం వెల్లడించింది. దీనితో ఆరు నెలల తర్వాత రాష్ట్రములో మళ్ళీ బార్లు, క్లబ్బులు ఓపెన్ కానున్నాయి..

ఇక కరోనాని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో మార్చి 22 నుంచి బార్లు కూడా మూతపడ్డాయి. ఇక అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్కోదానికి అనుమతి ఇచ్చుకుంటూ వస్తుంది ప్రభుత్వం.. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోగా ఈ రోజు నుంచి హైదరాబాదు సిటీ బస్సులు కూడా మొదలయ్యాయి. ఇక తాజాగా బార్లు, క్లబ్ లు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం..

ఇక రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి నిన్న రాత్రి 8 గంటల వరకు 57,621 నమూనాలు పరిశీలించగా రాష్ట్రంలో కొత్తగా 2,381 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అటు కొత్తగా మరో 10, మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1080కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,021 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,81,627కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,50,160కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,387యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories