Top
logo

కులం పిచ్చితో రెచ్చిపోతున్న ఉన్మాదులు

కులం పిచ్చితో రెచ్చిపోతున్న ఉన్మాదులు
X
Highlights

ప్రాచీనం నుంచి ఆధునీకం వరకు అదే పోకడా. సమాజం ఎంత మారినా వారి మైండ్ సెట్‌లు మాత్రం మారడం లేదు. అదే తీరు. ఎన్ని...

ప్రాచీనం నుంచి ఆధునీకం వరకు అదే పోకడా. సమాజం ఎంత మారినా వారి మైండ్ సెట్‌లు మాత్రం మారడం లేదు. అదే తీరు. ఎన్ని సార్లు హెచ్చరించినా ఎంత అవగాహాన కల్పించిన కొంతమంది మాత్రం కులం పేరుతోనే కాలం గడుపుతున్నారు. నయా సమాజంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన కొంతమంది మాత్రం ఇంకా కులపిచ్చితో చెలరేగిపోతున్నారు. అగ్రకులాలు ఇంకా కింది కులాలను బానిసలుగానే చూస్తున్నారు. మనిషిని మనిషిగా చూసే సమాజంలో కులం రక్కసితో రెచ్చిపోతున్నారు. అగ్రకుల అబ్బా యిని ప్రేమించినందుకు అగ్రకుల అమ్మాయిని ప్రేమించినందుకు హత్యలకు పాల్పడుతున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అవసరమైతే హత్యలకు కూడా తెగబడుతున్నారు.

భారతీయ సమాజంలో కులం కంపు నరనరాన జీర్ణించుకుపోయింది. ప్రాచీనకాలం నుంచి ఆధునీక కాలం వరకు అదే తీరు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన వారి మైండ్ సెట్ మాత్రం మారడం లేదు. కులం పిచ్చితో ఉన్మాదులుగా మారుతున్నారు. టెక్నాలజీతో అంతరిక్షంలో అడుగు పెడుతున్నా ఇంకా కులం గోడాలను పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. ఒక వైపు మనిషి కులం పేరుతో దూషిస్తున్న ఘటనలు జరుగుతున్నా మరో వైపు కులాంతర వివాహం చేసుకోవడం తట్టుకోలేకపోతున్నారు. దాంతో పరువు హత్యలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్‌ నగరంలో పరువు హత్య కలకలం రేపుతోంది. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక అల్లుడిని అతి కిరాతంగా హత‍్య చేయించాడో తండ్రి. చందానగర్‌కు చెందిన హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ప్రేమ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి కిరాయి మనుషులతో హేమంత్‌ను నిన్న మధ్యాహ్నం కిడ్నాప్ చేయించి, సంగారెడ్డిలో హత్య చేయించాడు.

గుంటూరు జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. గుంటూరు నగరంలో ఓ వివాహిత కిడ్నాప్ కలకలం రేపింది. విజయవాడకు చెందిన వైశ్య యువతిని ఎస్సీ యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. జూలై నెలలో దిలీప్ - సౌమ్య కులాంతర వివాహం చేసుకున్నారు. నాటి నుంచి యువతి - యువకుడికి తీవ్ర బెదిరింపులకు గురి చేశారు. సౌమ్య కుటుంబ సభ్యులు దిలీప్‌ను బెదిరించారు. తమ కూతురుని వదలి వెళ్లాలని కోరారు. దానికి ప్రేమికులు ససేమిరా అనడంతో హత్య చేస్తానని బెదిరింపులకు దిగారు. ప్రణయ్ విషయం గుర్తు ఉందిగా అంటూ హెచ్చరించారు. ప్రణయ్ మాదిరిగా హత్య చేస్తామని యువతి తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాదు అరండల్‌పేట సీఐతో యువకుడికి తీవ్రంగా బెదిరింపులకు గురిచేశారు.

చివరకు యువకుడి ఇంట్లో ఉన్న యువతిని పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. అడ్డువచ్చిన యువతి అత్తని కొట్టి యువతిని పోలీసులు లాక్కెళ్లారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన యువకుడు తనకు ప్రాణహాని ఉందంటూ ఎస్పీని ఆశ్రయించాడు. గుంటూరు ఎస్పీ సమక్షంలో కులాంతర పెళ్లివివాదం ముగిసింది. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటన విశాఖ జిల్లా రావికమతం మండలం, గుమ్మలపాడులో చోటు చేసుకుంది. దళిత యువతిని అగ్రకులం యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ పెళ్లిని అడ్డుకున్న అగ్రకులం పెద్దలు దళితుల కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. వారికి నీళ్లు, పాలు, నిత్యావసర సరుకులు అందించకుండా చేశారు. మనిషిని మనిషిగా చూడాల్సిన సమాజంలో కులం పేరుతో అడ్డు గోడలు కడుతున్నారు. కులం పేరుతో పరువు హత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలు కులానికి వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసిన ఫలితం లేకుండా పోతుంది.

Web TitleExtreme casteism taking lives of innocent
Next Story