తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌
x
Highlights

- ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు - ఈ నెల 17 నుంచి సమ్మె బాటపట్టనున్న కార్మికులు

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగుతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈనెల 17 నుండి మెరుపు సమ్మె చేపట్టబోతున్నట్లు కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం నేటికి ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో విలీన ప్రక్రియ ఆగిపోయిందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

టీఎస్‌ఆర్‌టీసీలో 'సమ్మె సైరన్' మోగనుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 17 నుండి మెరుపు సమ్మె చేపడట్టనున్నట్లు కార్మిక సంఘం నేతలు హెచ్చరించారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి 2013 అక్టోబర్ లోనే జీవో విడుదల చేసినా నేటికి చర్యలు తీసుకోలేదని... ఏపీలో కొత్త సర్కార్ ఏర్పడిన 90 రోజుల్లోనే ఆర్టీసీ విలీనంపై కమిటీ వేసి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెబుతున్నారు కార్మిక సంఘం నేతలు.

జీతభత్యాల సవరణ చేపట్టాలని.. ఆర్టీసీకి ఐదు సంవత్సరాల టాక్స్ హాలిడే ప్రకటించడంతో పాటు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో పెరుగుతున్న డీజిల్ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఖాళీ పోస్టులను భర్తీ చేసి కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు.

తెలంగాణ రాష్ర్ట ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories