ఏసీబీ కేసుల్లో రెవెన్యూ టాప్

ఏసీబీ కేసుల్లో రెవెన్యూ టాప్
x
ACB
Highlights

అవినీతి అనకొండలు-లంచావతారాలు రెచ్చిపోతున్నారు. పైసలు లేనిదే ఫైల్ కదలట్లేదు. అక్రమార్జనే డ్యూటీ గా పెట్టుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత...

అవినీతి అనకొండలు-లంచావతారాలు రెచ్చిపోతున్నారు. పైసలు లేనిదే ఫైల్ కదలట్లేదు. అక్రమార్జనే డ్యూటీ గా పెట్టుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత అవినితీకి పాల్పడినట్లు ఏసీబీ లెక్కలు చుస్తే అర్థం అవుతుంది. సర్కారు అధికారుల అవినీతి టాప్‌లో రెవెన్యూ ,-సెకండ్ ప్లేస్ లో మున్సిపల్ శాఖ , మూడులో నాలుగో సింహం , అవినీతిలో పోటి పడుతున్నారు. మేమంటే మేమని అందినకాడికి దోచుకుంటున్నారు. అందినకాడికి దోచుకుంటున్న అవినీతీ అనకొండలు పై hmtv స్పెషల్ స్టోరీ

లంచాలకు రుచి మరిగిన ప్రభుత్వ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఏటా వందల మంది ఏసీబీకి చిక్కినా అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. డిపార్ట్ మెంట్ ఏదైనా సరే సామాన్యున్ని వదలకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నామని ఓ వైపు ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు అవినీతి అధికారులు అందినంతా దండుకుంటున్నారు. వేలల్లో జీతాలు ఉన్నా బల్ల కింద బ్యాలెన్స్ లేనిదే పెన్ను కదపడం లేదు. ప్రతీ ఏటా ఎంత మంది అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కినా శాఖల్లో పేరుకుపోయిన అవినీతి మాత్రం వీడడం లేదు. ఏసీబీకి బెదరకుండా అందినంత అవినీతి సొమ్ము సంపాదిస్తున్నారు. డిపార్ట్ మెంట్ల వారిగా ఎవరికి అందినకాడి వారు దోచుకుంటున్నారు.

ప్రభుత్వం శాఖల్లో జరిగిన అవినీతీ చిట్టా చూస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులపై గతేడాది139 కేసులు నమోదు అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా 173 కేసులు నమోదు అయ్యాయి .. 2019లో నమోదైన ఏసీబీ కేసుల సంఖ్యను పరిశీలిస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో అత్యధికంగా 54 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది రెవెన్యూ శాఖలో 37 అవినీతి కేసులు నమోదయితే ఈ ఏడాది అత్యధికంగా 54 కేసులు నమోదయ్యాయి. హోం డిపార్ట్మెంట్ 18 , మున్సిపల్ శాఖ 25 , పంచాయితీ రాజ్ 10 , విద్యుత్ శాఖకి చెందిన ఉద్యోగులపై 12 కేసులు నమోదయ్యాయి.

అవినీతి కేసుల్లో రెవెన్యూ డిపార్ట్ మెంట్ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో మున్సిపల్ , మూడవ స్థానంలో పోలీస్ డిపార్ట్ మెంట్ నిలిచింది. ఈ ఏడాది కూడా గతేడాది కంటే ఎక్కువగానే కేసులు నమోదయ్యాయి . వీటితో పాటు పంచాయితీరాజ్,ఆర్టీఓ,సబ్ రిజిస్టార్,ఎలక్ట్రిసిటీ,ఫిషరీస్,హెల్త్,ఫారెస్ట్ డిపార్ట్ మెంట్,సర్వేయర్లు ఏసీబీకీ చిక్కారు. మరోవైపు బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాల్సిన ఇద్దరు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు.

ఇక మిగిలిన ప్రభుత్వ శాఖల్లో కూడా ఇదే తీరు ఉంది .. పంచాయితీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖ పై 2018 లో 13 కేసులు , 2019 లో పది కేసులు నమోదు చేశారు ఏసీబీ అధికారులు .. విద్యుత్ శాఖ లో అవినీతి తిమింగలాలు పై 12 కేసులు , న్యాయ శాఖ పై 5 , ఇరిగేషన్ పై 3, విద్యాశాక 4, హెల్త్ మెడికల్ 13, రోడ్డు రవాణా శాఖ పై 3 ,ఇతరత్రా కేసులు 24 నమోదు చేశారు .. మొత్తం ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో గత ఏడాది 139 నమోదు చేస్తే .. ఈ ఏడాది 173 కేసులు నమోదు చేశారు అధికారులు ..

అవినీతి నిర్మూలన కోసం ప్రభుత్వాలు,ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా అవినీతికి అడ్డుకట్ట పడడం లేదు. ఇలా గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు వేళ్లూనుకుపోయిన అవినీతికి సామాన్యుడు బలౌతూనే ఉన్నాడు. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడితే 1064 టోల్‌ఫ్రీ నంబర్ ద్వార తమకు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories