Maoists: గడ్డం మధుకర్‌ను పోలీసులే హత్య చేశారు- సమత

Maoists: మావోయిస్టు పార్టీ నేత గడ్డం మధుకర్‌ని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

Arun Chilukuri
Published on: 9 Jun 2021 10:15 AM IST
Telangana police killed Madhukar: Maoists
X

గడ్డం మధుకర్‌(ఫైల్ ఇమేజ్ )

Maoist: మావోయిస్టు పార్టీ నేత గడ్డం మధుకర్‌ని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. గడ్డం మధుకర్‌ అలియాస్‌ శోభారాయ్‌ని పోలీసులు హత్య చేశారని మంగళవారం ఆ పార్టీ దక్షిణ జోనల్‌ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఆరోపించారు. మధుకర్‌కు ఎలాంటి వైద్య సేవలు అందించకుండా, హింసించి హత్య చేశారని, మే 27న పీఎల్‌జీఏకు చెందిన ప్లాటూన్‌ కమాండర్‌ గంగాల్‌ను ఇదే తరహాలో హత్య చేశారని ఆరోపించారు. పోలీసు అధికారులు తమ చేతికి చిక్కినవారిని హత్య చేస్తూనే కరోనాను సాకుగా చూపుతూ సరెండర్‌ కావాలని, సరెండర్‌ అయిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తామని ప్రలోభపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాల అబద్ధపు ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మవద్దని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story