తెలంగాణను వెంటాడుతోన్న కరోనా భయం.. వైరస్ ఉందన్న భయంతో ఓ కుటుంబాన్ని కాలనీలోకి రానివ్వని స్థానికులు

తెలంగాణను వెంటాడుతోన్న కరోనా భయం.. వైరస్ ఉందన్న భయంతో ఓ కుటుంబాన్ని కాలనీలోకి రానివ్వని స్థానికులు
x
Highlights

తెలంగాణ ప్రజలనును కరోనా భయం వెంటాడుతోంది. ప్రభుత్వం, అధికారులు భయపడొద్దని చెబుతోన్నా వైరస్ ఎక్కడ తమకు సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు...

తెలంగాణ ప్రజలనును కరోనా భయం వెంటాడుతోంది. ప్రభుత్వం, అధికారులు భయపడొద్దని చెబుతోన్నా వైరస్ ఎక్కడ తమకు సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా 29 కేసులు నమోదతే తెలంగాణలో మాత్రం కేవలం ఒక్క కేసు మాత్రమే పాజీటీవ్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. మరో రెండు కేసులు ఇంకా నిర్ధారించాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. కరోనా పాజిటీవ్ గా వచ్చిన యువకుడితో పరిచయం ఉన్న వారిని 47 మందిని టెస్టులు చేస్తే వారిలో 45 మందికి కరోనా నెగిటివ్ వచ్చింది. మరో ఇద్దరి టెస్టులను పూణే ల్యాబ్‌కు పంపారు.

తెలంగాణలో ఇప్పటి వరకు 155 మంది కరోనా అనుమానంతో గాంధీలో జాయిన్ కాగా, 118 మందికి కరోనా నెగిటీవ్ వచ్చినట్లు తేల్చారు. మరో 36 మందికి అనుమానితులను ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇప్పటి వరకు కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలు వదంతులు నమ్మొద్దన్నారు మంత్రి ఈటల. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా లక్షణాలు బయటపడ్డాయన్నారు. ఇటు డీజీపీ మహేందర్ రెడ్డి సైతం కరోనాపై తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కరోనా నేపథ్యంలో హోలీ సంబరాలు నిషేధించాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సిద్దలక్ష్మి అనే మహిళ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. ప్రజల ఆరోగ్యం ద‌ష్ట్యా హోలీని ఈ ఏడు నిషేధించాలని పేర్కొంది. అయితే కరోనా నిరోధానికి చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు ఎదుర్కొనే చర్యలకు సంబంధించిన ప్రణాళికను సమర్పించాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ, హైదరాబాద్‌ మెట్రో అలర్ట్ అయ్యాయి. బస్ స్టేషన్‌లు, బస్సుల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మెట్రో కూడా సిబ్బందికి సూచనలు చేసింది. ప్రయాణీకులు ఎక్కువగా ఉపయోగించే వాటిని శుభ్రపర్చారు. ఇదే విషయమై మంత్రి కేటీఆర్‌ కూడా ట్వీట్‌ చేశారు.

సికింద్రాబాద్ రవి కాలనీకి చెందిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. కరోనా లక్షణాలు రావడంతో గాంధీకి వెళ్లి చికిత్స తీసుకున్న సదరు కుటుంబం వైరస్ లేదని తేలడంతో తమ ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అక్కడి పెద్దలు ఆ కుటుంబాన్ని కాలనీలోకి అనుమతించలేదు. 15 రోజుల వరకు కాలనీలోకి రావొద్దని తెలిపారు. ఇటు మహేంద్రహిల్స్ కాలనీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా నెగిటివ్ వచ్చిన వారు కూడా 15 రోజుల వరకు కాలనీలోకి రావొద్దని అంటున్నారు. గాంధీ ఆసుపత్రిలో నెగిటివ్ వచ్చినప్పటికీ 15 రోజుల వరకు ఐసోలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం చెప్తుంటే కాలనీలోకి రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories