ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిబ్బంధికి గుడ్ న్యూస్

ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిబ్బంధికి గుడ్ న్యూస్
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బోధనా ఆసుపత్రులలో విధులు నిర్వహించే సిబ్బంది జీతాలను పెంచుతూ ఉత్తర్వులు...

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బోధనా ఆసుపత్రులలో విధులు నిర్వహించే సిబ్బంది జీతాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. బోధనా సిబ్బందికి జీతాల పెంచాలనే నిర్ణయం గత నాలుగున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉండి పోతుంది. అయితే కొన్ని రోజుల క్రితమే గాంధీ ఆసుపత్రి వైద్యులు, అలాగే ఇతర సిబ్బంది కూడా తమ జీతాలు పెంచాలనే డిమాండ్ తో సమ్మెకు దిగాయి. కాగా వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం వారి జీతాలను 24 శాతం నుంచి 44 శాతానికి పెంచాలని నిర్ణయించింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనా ఆసుపత్రులలో సుమారు 2,866 మంది అధ్యాపకులు ఉండగా వీరందరి వేతనాలు పెరిగాయి. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పే రివిజన్‌ను అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆయన హర్షం వ్యక్తం చేసారు. ఇది అధ్యాపకులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న చాలా మంది అభ్యర్థులను ప్రోత్సహిస్తుందని అన్నారు. గురువారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పెరిగిన జీతాలు ఈ నెల నుండి నగదు రూపంలో చెల్లించబడతాయి అంటే అక్టోబర్ నుంచి చెల్లించడుతాయని తెలిపారు. వేతన సవరణలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ .67,000 నుంచి 90,000 అంటే (34 శాతం పెరుగుదల), అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ .80,000 నుండి 1,00,000 (24 శాతం పెరుగుదల) కు పెరుగుతుంది. ఇక ప్రొఫెసర్ వేతనాలు రూ. 1,25,000 నుండి 1,80,000 (44 శాతం పెరుగుదల) కు పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories