Top
logo

తెలంగాణ శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా

తెలంగాణ శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా
X
Highlights

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు శుక్ర‌వారానికి వాయిదా ప‌డ్డాయి. ప్ర‌శ్నోత్త‌రాలు, జీరో...

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు శుక్ర‌వారానికి వాయిదా ప‌డ్డాయి. ప్ర‌శ్నోత్త‌రాలు, జీరో అవ‌ర్ ముగిసిన అనంత‌రం స‌భ‌ను రేప‌టికి వాయిదా వేస్తున్న‌ట్లు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్ ప్ర‌క‌టించారు. స‌భ‌లో ఇవాళ ఆసరా పెన్ష‌న్లు, ఆయిల్ ఫామ్ సాగు, గ్రామ‌పంచాయ‌తీల అభివృద్ధి, ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థతో పాటు ఇత‌ర అంశాల‌పై ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగాయి. జీరో అవ‌ర్‌లో స‌భ్యులు ప్ర‌తిపాదించిన స‌మ‌స్య‌ల‌ను మంత్రులు నోట్ చేసుకున్నారు. శుక్ర‌వారం రెవెన్యూ బిల్లుపై చర్చి‌స్తారు. రోజంతా సభ జరిగే అవ‌కా‌శం ఉంది. కాగా తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.


Web TitleTelangana assembly adjourned till Friday
Next Story