MLC Election Results: తుది అంకానికి చేరిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

MLC Election Results: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు చివరిదశకు చేరుకుంది. నాలుగు రోజులుగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది.

Arun Chilukuri
Published on: 20 March 2021 3:32 PM IST
Telangana MLC election Results Get Soon
X

MLC Election Results: తుది అంకానికి చేరిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

MLC Election Results: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు చివరిదశకు చేరుకుంది. నాలుగు రోజులుగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. రెండు స్థానాల్లో ఇప్పటివరకు జరిగిన ఎలిమినినేషన్ల తర్వాత ముగ్గురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు.

నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫ్రొఫెసర్ కోదండరాం పుంజుకున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు లక్షా 22 వేల 639 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్నకు 99 వేల 207 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరాంకు 89వేల 407 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న రెండో స్తానంలో ఉండగా టీఆర్ఎస్‌ అభ్యర్థి 23 వేల 432 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఇక నాలుగో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ ఓట్ల బదలాయింపు కొనసాగుతోంది. ప్రేమేందర్‌కు 42 వేల 15 ఓట్లు పోలవడంతో ఓట్ల బదలాయింపుపై తీన్మార్ మల్లన్న, కోదండరామ్‌ ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరి మధ్య 9 వేల 800 ఓట్ల వ్యత్యాసం ఉండటంతో నెక్స్ట్‌ ఎలిమినేషన్‌ ఎదుర్కునేది ఎవరనే ఉత్కంఠ నెలకొంది.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణిదేవికి 8,812 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సురభి వాణికి ఒక లక్షా 28 వేల పది ఓట్లు రాగా బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావుకు ఒక లక్షా 19 వేల 198 ఓట్లు వచ్చాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 67 వేల 383 ఓట్లు పోలయ్యాయి. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఓట్ల బదలాయింపు దాదాపు ఫలితాన్ని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story