నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ.. కేంద్రం ఆ ప్రతిపాదన విరమించుకోకపోతే ఉద్యమం తప్పదు

KTR: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు.
x

నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ..

Highlights

KTR: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. వస్త్ర పరిశ్రమపై అదనపు జీఎస్టీని విరమించుకోవాలని ఆయన లేఖలో కోరారు.

KTR: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. వస్త్ర పరిశ్రమపై అదనపు జీఎస్టీని విరమించుకోవాలని ఆయన లేఖలో కోరారు. జీఎస్టీ పన్ను పెంపు వల్ల వస్త్ర, చేనేత పరిశ్రమ పూర్తిస్థాయిలో కుదేలవుతుందని లేఖలో కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పన్ను పెంపు కోట్లాది మంది కార్మికులకు సమ్మెట పోటన్నారు. ఈ విషయంలో ఒక వేళ కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే.. వ్యవసాయ చట్టాల విషయంలో రైతన్నలు తిరగబడిన మాదిరే దేశంలోని నేతన్నలు సైతం తిరగబడతారని హెచ్చరించారు.

పన్ను పెంపు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకునే వరకు ఈ విషయంలో వస్త్ర పరిశ్రమ పారిశ్రామిక వర్గాలకు, దేశంలోని నేతన్నలకు తెలంగాణ తరఫున అండగా ఉంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories