కరోనా మీ కడుపులకి పోతే పిప్పి...పిప్పే

గత కొంత కాలంగా ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా గురించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ సమావేశంలో అదరగొట్టే స్పీచ్ ఇచ్చాడు.

Sumitra
Updated on: 10 Jun 2020 5:09 PM IST
కరోనా మీ కడుపులకి పోతే పిప్పి...పిప్పే
X
Telangana minister errabelli dayakar rao(File photo)

గత కొంత కాలంగా ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా గురించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ సమావేశంలో అదరగొట్టే స్పీచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'కరోనా వచ్చి పడిశంలో, గొంతులో ఆగుతుంది. గొంతులో ఉంటే శరీరంలోకి ఎక్కుతుంది. జలుబు, దగ్గు లేకపోతే ఠక్కున కడుపులోకి పోతుంది. మీ కడుపులో మిషన్ మంచిది. ఎటువంటి బొక్కలు గానీ, సిమెంట్ గానీ ఏదైనా నమిలిపెట్టే మిషన్ ఇచ్చిండు భగవంతుడు మనకి.

అందులోకి కరోనా పడితే పిప్పి పిప్పి బయటకు పంపేస్తుంది. అటువంటి మంచి మిషన్ ఇచ్చాడు దేవుడు మనకి. అది మీ గొంతులో, ముక్కులో ఉంటే కరోనా శరీరంపై ప్రభావం చూపుతుంది. వేడి నీటి ద్వారా కడుపులోకి వెళ్తే ఇబ్బందేం ఉండదు' అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

ఇక మంత్రి ఎర్రబెల్లి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండి పడుతున్నారు. కొంత మంది నెటిజన్లు ఎర్రబెల్లి ఉండగా కరోనా గురించి భయమెందుకు దండగా' అంటూ వ్యంగాస్త్రాలు సందిస్తుంటే.. మరి కొంత మంది నెటిజన్లు మాత్రం ఎయిమ్స్, ఢిల్లీ వర్క్‌షాప్‌లో ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు ఇవంటూ సెటైర్ వేశారు.

Sumitra

Sumitra

Next Story