మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌‌కు ప్రమాదం..ఇద్దరు దుర్మరణం

మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు

Samba Siva Rao
Updated on: 24 Nov 2019 9:40 AM IST
మంత్రి ఎర్రబెల్లి  కాన్వాయ్‌‌కు ప్రమాదం..ఇద్దరు దుర్మరణం
X
Two die as the car turtles in Minister Errabelli Dayakar Rao's convoy

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తుటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలైయ్యాయి. హైదరాబాద్ నుంచి పాలకుర్తికి వెళ్తుండగా చీటూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కాన్వాయ్‌లో ఓ వాహనం ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. కారు నడుపుతున్న డ్రైవర్ పార్థసారధి, పూర్ణ ఇద్దరూ మృతి చెందారు. గన్‌మెన్‌ నరేశ్‌, అటెండర్‌ తాతారావు, శివలు గాయాలైయ్యాయి. మంత్రి మరో కారులో ప్రయాణిస్తుండడంతో ప్రమాదం తప్పింది.

క్షతగాత్రులను వైద్యం కోసం జనగామ జిల్లాతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన మంత్రి అక్కడే కొద్దిసమయం అక్కడే ఉన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశించారు. తన వద్ద పనిచేసే డ్రైవర్‌ పార్థసారథి, సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి పూర్ణ మృతిచెందడంతో మంత్రి దయాకర్‌రావు కన్నీటిపర్యంతమయ్యారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story