కోవిడ్‌ కేంద్రాలపై సర్కారు నజర్‌

కోవిడ్‌ కేంద్రాలపై సర్కారు నజర్‌
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Telangana medical health department instructions : మొన్న అహ్మదాబాద్‌లో ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంఘటన చోటు చేసుకుంది.

Telangana medical health department instructions : మొన్న అహ్మదాబాద్‌లో ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంఘటన చోటు చేసుకుంది. అది మరచిపోకముందు నిన్న విజయవాడలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్న ఐసోలేషన్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇలాంటి వరుస అగ్ని ప్రమాద సంఘటనలను చూస్తున్న తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్‌ అయింది. ప్రస్తుతం ఏయే ఆస్పత్రుల్లో, ఏయే హోటళ్లలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నారో అన్ని కరోనా ఆస్పత్రుల్లోనూ అగ్నిప్రమాద నివారణ నిబంధనలపై తక్షణమే తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని ఆస్పత్రులు/కోవిడ్‌ కేర్‌ సెంటర్లు (హోటళ్లు) అగ్ని ప్రమాద నివారణకు భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తెలిపిన విధంగా భద్రతా చర్యలు పాటించకపోయినా, నిబంధనల ఉల్లంఘించిన ఆయా ఆస్పత్రులపై కోవిడ్ కేర్ సెంటర్లపై తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే అన్ని ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల (హోటళ్ల)కు ఆదివారం రాత్రి ఆయన ఆదేశాలు ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లలో ఏ మేరకు అగ్ని ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకుంటున్నారో దానిపైన వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు చేయాలని యోచిస్తుంది.

ఇక పోతే ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్‌ కేర్ సెంటర్లుగా 36 హోటళ్లు అనుమతులను పొందాయి. కాగా మరో 50 నుంచి 60 హోటళ్లలో ఎలాంటి అనుమతులు లేకుండా వారి ఇష్టానుసారంగా కరోనా బాధితులను ఐసోలేషన్లో ఉంచుతున్నట్లు వైద్య వర్గాలు గుర్తించాయని సమాచారం. అయితే ఆయా హోటల్లు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా నడిపిస్తున్నారని కొంత మంది బాధితులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక పోతే కరోనా సోకిన కొంత మంది హోటల్లలో ఉంటూ సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలోని పలు త్రీస్టార్, ఫైవ్‌స్టార్‌ హోటళ్లు క్వారంటైన్‌ కేంద్రాలుగా మారుతున్నాయి. ఆయా హోటళ్లలో సుమారు మూడువేల మంది వరకు కోవిడ్‌ రోగులు ఉన్నట్లు సమాచారం.

ఇక పోతే అగ్ని ప్రమాదాల నివారణకు వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన సూచలనల విషయానికొస్తే

హోటల్‌ లేదా ఆస్పత్రి బిల్డింగ్‌పై పెద్ద నీటి తొట్టిని ఏర్పాటు చేయాలి.

అగ్నిప్రమాదంలో చేపట్టాల్సిన చర్యలపై అప్పుడప్పుడు మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలి.

ఆస్పత్రులు, హోటళ్లలో అగ్నిప్రమాద నివారణ కోసం జనరేటర్‌ అందుబాటులో ఉంచాలి.

ప్రతీ ఫ్లోర్‌కు నీటిని అందించేందుకు వీలుగా పెద్ద పైపును ఏర్పాటు చేయాలి.




Show Full Article
Print Article
Next Story
More Stories