World's First Corona Vaccine: శుభవార్త చెప్పిన రష్యా: ఆగస్టు 12న కరోనా వ్యాక్సిన్ విడుద‌ల‌!

Worlds First Corona Vaccine:  శుభవార్త చెప్పిన రష్యా: ఆగస్టు 12న కరోనా   వ్యాక్సిన్ విడుద‌ల‌!
x
Russia launch world's first corona vaccine on 12 August!
Highlights

World’s First Corona Vaccine: ప్రపంచ దేశాలను కరోనా మహ‌మ్మ‌రి కుదిపేస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచం అవస్తవ్యస్తమైంది. అనేక రంగాలు కుదేలైపోయాయి.

World's First Corona Vaccine: ప్రపంచ దేశాలను కరోనా మహ‌మ్మ‌రి కుదిపేస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచం అవస్తవ్యస్తమైంది. అనేక రంగాలు కుదేలైపోయాయి. ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి స‌రైన వ్యాక్సిన్ లేదా చికిత్సా లేక‌పోవ‌డ‌మే. మ‌హ‌మ్మ‌రి క‌ట్ట‌డికి అటు శాస్త్ర‌వేత్త‌లు, అన్నిదేశాల‌ ప్ర‌భుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ‌దేశాల‌కు ర‌ష్యా ఓ శుభ‌వార్త చెప్పింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్ ను తొలిసారిగా ఈ నెల 12న ప్రపంచానికి పరిచయం చేయనున్నామని రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది.

గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా క‌రోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. రక్షణ శాఖ ప్రతినిధి గ్రిడ్నేవ్ మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ సిబ్బందికి, వయో వృద్ధులకు తొలిసారి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. వ్యాక్సిన్ సురక్షితను, పనితీరును 1,600 మందిపై పరిశీలించామన్నారు. గడచిన ఏప్రిల్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ సమయాన్ని కుదించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారులను ఆదేశించగా, వైద్య నిపుణులు మూడు దశల పరీక్షలను శరవేగంగా పూర్తి చేశారు.

ఈ క్రమంలో జూన్ 17వ తేదీన 76 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలను నిర్వహించారు. వీరిలో సగం మందికి ఇంజక్షన్ రూపంలో, మిగతావారికి పౌడర్ రూపంలో వ్యాక్సిన్‌ను అందించారు. రెండు రకాల పరీక్షల్లోనూ వ్యాక్సిన్ తీసుకున్న వారిపై సత్ఫలితాలను ఇచ్చిందని, అందరిలోనూ వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని రష్యా మీడియా వెల్లడించింది. ఎవ్వ‌రికీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేద‌ని పేర్కొంది.

మరోవైపు, రష్యా చేసిన ప్రకటనపై అమెరికా స్పందించింది. వ్యాక్సిన్‌ను అన్ని రకాలుగా పరీక్షించి, ఫలితాలను నిర్దారించుకున్న త‌ర్వ‌త‌నే రష్యా ఈ నిర్ణయం తీసుకున్న‌ద‌ని యూఎస్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ ఆంటోనీ ఫౌసీ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ త‌యారీలోనూ ఎలాంటి ఆవ‌రోధ‌లు త‌ల్లెత‌కుండా ముందు జాగ్ర‌త్త తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories