Telangana Local Body Elections: ఉద్యోగం వదిలి.. ఎన్నికల బరిలోకి..

Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 6 Dec 2025 12:05 PM IST
Telangana Local Body Elections: ఉద్యోగం వదిలి.. ఎన్నికల బరిలోకి..
X

Telangana Local Body Elections: ఉద్యోగం వదిలి.. ఎన్నికల బరిలోకి..

Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం కోసం ఆశా వర్కర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి.. మూడో విడతలో నామినేషన్ దాఖలు చేసింది ఓ మహిళ. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలోని చిక్కెపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీ చేసేందుకు.. ఓ ఆశా కార్యకర్త తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. చిక్కెపల్లి గ్రామానికి చెందిన పార్వతి అనే మహిళ.. పదేళ్లుగా ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది.

అయితే.. చిక్కెపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో.. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌కు లేఖను అందించింది. రాజీనామాను DMHO కూడా అంగీకరించడంతో ఆ మహిళ బాధగా కన్నీరు పెడుతూ.. సర్పంచ్‌ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసింది. అయితే.. కన్నీరు పెడుతున్న పార్వతిని.. తోటి మహిళలు ఓదార్చారు. తనకు అండగా ఉంటామని, గెలిపించి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. పార్వతి బీఆర్‌ఎస్‌, బీజేపీ మద్దతుతో నామినేషన్‌ దాఖలు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story