లాయర్‌ దంపతుల హత్య: దర్యాప్తు ముమ్మరం

తెలంగాణలో సంచలనం సృష్టించిన లాయర్ దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.

Venkata Chari
Published on: 22 Feb 2021 3:34 PM IST
Telangana Lawyer Advocate Couple Murder Case Updates
X

వామాన్ రావు దంపతులు (ఫోటో ది హన్స్ ఇండియా)

https://www.hmtvlive.com/telangana/reason-behind-the-vaman-rao-death-60507

తెలంగాణలో సంచలనం సృష్టించిన లాయర్ దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈరోజు మంథని కోర్టులో రామగిరి పోలీసులు కస్టడీ పిటిషన్‌ వేశారు.

ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీగా ఉన్న నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య చేసిన నిందితులకు వాహనం, ఆయుధాలు సమకూర్చడంపై బిట్టు శ్రీనుపై అభియోగాలు ఉన్నాయి. ఈ నెల 19న ముగ్గురు నిందితులను ఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లిన పోలీసులు.. హత్య సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

వామన్ రావు హత్య కేసులో మంథని న్యాయవాదులు పోరాటానికి సిద్ధం అయ్యారు. మార్చి ఒకటో తేదీ వరకు కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రామగుండం సీపీ సత్యనారాయణకు లీగల్ నోటీసులు జారీచేయనున్నారు. ఈ కేసులో సీబీఐ విచారణ చేయించాలని హైకోర్టుకు మంథని న్యాయవాదులు లేఖ రాశారు. నిందితుల తరపున ఎవరూ వకాల్తా తీసుకోవద్దని ఇతర బార్ అసోసియేషన్ లకు లేఖలు రాయాలని నిర్ణయం తీసుకున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story