Telangana: కరోనాను జయించిన సీఎం కేసీఆర్

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనాను జయించారు. ఇవాళ నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.

Arun Chilukuri
Published on: 5 May 2021 1:55 PM IST
Telangana: KCR Tested Negative for Coronavirus
X

Telangana: కరోనాను జయించిన సీఎం కేసీఆర్

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనాను జయించారు. ఇవాళ నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో కరోనా బారి నుంచి సీఎం కేసీఆర్ బయటపడినట్టు వైద్యులు తెలిపారు. సీఎం సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఆర్టీపీసీఆర్ తో పాటు రక్తపరీక్షల్లోనూ నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అన్ని రక్త పరీక్షల రిపోర్టులు కూడా సాధారనంగా ఉన్నాయని తేలింది. దాంతో సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు వైద్యులు నిర్దారించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకున్నారు. ఆయనకు ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్యుల బృందం కొవిడ్ చికిత్స చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story