నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

TS Inter Results: ఉ.11 గంటలకు విడుదల చేయనున్న ఇంటర్ బోర్డ్

Jyothi
Published on: 24 April 2024 7:24 AM IST
Telangana Inter Results Released Today
X

నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

TS Inter Results: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఏప్రిల్‌ 24న ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు రాశారు.

Jyothi

Jyothi

Next Story