పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటున్న బీఆర్‌ఎస్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Sept 2024 8:49 AM IST
Telangana High Court
X

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌ కాంగ్రెస్‌లో చేరారు. అయితే.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటోంది బీఆర్‌ఎస్‌. ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఏప్రిల్‌ 24న ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే.. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్‌ వేశారు. ఆగస్టు 7న ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు రిజర్వ్‌ చేసింది. ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పును ప్రకటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story