BRS Party: బీఆర్‌ఎస్‌కు షాక్.. పార్టీ ఆఫీస్ కూల్చివేతకు హైకోర్టు ఆదేశాలు..

Nalgonda BRS Office: తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్‌కు చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్‌ పార్టీ ఆఫీస్‌ను కూల్చేయాలని ఆదేశించింది ధర్మాసనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Sept 2024 2:06 PM IST
Telangana High Court Issues Orders To Demolish BRS Party Office in Nalgonda
X

BRS Party: బీఆర్‌ఎస్‌కు షాక్.. పార్టీ ఆఫీస్ కూల్చివేతకు హైకోర్టు ఆదేశాలు..

Nalgonda BRS Office: తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్‌కు చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్‌ పార్టీ ఆఫీస్‌ను కూల్చేయాలని ఆదేశించింది ధర్మాసనం. 15రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని సూచించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్‌ చేసేవిధంగా మున్సిపల్‌శాఖ అధికారులకు ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది బీఆర్‌ఎస్‌.

పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పార్టీ ఆఫీస్‌ కట్టిన తర్వాత ఏరకంగా అనుమతిస్తారని ప్రశ్నించింది. కట్టకముందు అనుమతి తీసుకోవాలి కానీ, కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు మొట్టికాయలు వేసింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తెలిపింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story