చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. జులై 2కు విచారణ వాయిదా

చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. జులై 2కు విచారణ వాయిదా
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం విచారించింది. పిటీషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 లక్షల మంది చేనేత కార్మికుల గత మూడు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికే 200 కోట్ల చేనేత ముడి సరుకు కార్మికుల వద్ద సిద్దంగా ఉందన్న పిటీషనర్..చేనేత ముడి సరుకును మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోర్టుకు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేని చేనేత కార్మికుల కేజ్ నెలకు 30 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని కోరిన పిటీషనర్...చనిపోయిన చేనేత కార్మికుల కు ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ ధాఖలు చేసిన ప్రభుత్వం.. చేనేత కార్మికులకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదని కోర్టుకు తెలిపిన సీనియర్ కౌన్సిల్ రంగయ్య..లొక్డౌన్ సమయంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అని ప్రభుత్వంను ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రభుత్వం ఏ విధమైన ఆర్థిక సహాయం చేయలేదన్న రంగయ్య చెప్పారు. లాక్ డౌన్ నుంచి ఈరోజు వరకు రాష్ట్రంలో ఏ ఒక్క చేనేత కార్మికుని ఆర్ధిక సహాయం అందలేదని కోర్టులో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం టెక్సటైల్ డిపార్ట్మెంట్ ఒక సర్కులర్ జారీ చేసిందని వెల్లడించారు. ప్రభుత్వం కౌంటర్ లో పేర్కొన్న అంశాలన్నీ తప్పులతో కూడుకుందని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ధాఖలు చేసిన కౌంటర్ పై రీప్లై కౌంటర్ వేస్తామన్న పిటిషన్ తరపు న్యాయవాది..10 రోజుల్లో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పిటీషనర్ కు హైకోర్టు అదేశం ఇచ్చింది. హైకోర్టు జులై 2 కు తదుపరి విచారణను వాయిదా వేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories