చేనేత రంగానికి లాక్ డౌన్ దెబ్బ

చేనేత రంగానికి లాక్ డౌన్ దెబ్బ
x
Highlights

లాక్ డౌన్ ప్రభావం తో ప్రకాశం జిల్లా చేనేత రంగo కుదేలైంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న చేనేత రంగంపై లాక్ డౌన్ పిడుగులా పడింది. ఓవైపు గిట్టుబాటు ధర లేక...

లాక్ డౌన్ ప్రభావం తో ప్రకాశం జిల్లా చేనేత రంగo కుదేలైంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న చేనేత రంగంపై లాక్ డౌన్ పిడుగులా పడింది. ఓవైపు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న చేనేత రంగానికి కరోనా ప్రభావం కోలుకోలేని దెబ్బ తీసింది.

ప్రకాశం జిల్లాలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువమంది చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా చీరాల ప్రాంతంలో చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగించే వారే ఎక్కువ. లాక్ డౌన్ కు ముందు చేనేత రంగం ఆటుపోట్లతో కొట్టుమిట్టాడుతూ ఉండేది చేసే పనికి వచ్చే ఆదాయానికి తీవ్ర వ్యత్యాసం ఉండడంతో చేనేత రంగంపై ఆధారపడి జీవించే వారి కుటుంబాల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటూ వస్తుంది.

తప్పని పరిస్థితుల్లో చేనేత రంగం పని చేస్తున్నా వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది చీరాల ప్రాంతంలో గతంలో ప్రతి కుటుంబం చేనేత పై ఆధారపడి జీవిస్తే ప్రస్తుతం మాత్రం పది వేల కుటుంబాలు మాత్రమే ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. లాక్ డౌన్ కు ముందు చేనేతను ఆదుకోవాలని ఎన్నోసార్లు ఆందోళనలో చేశారు. అయితే ప్రభుత్వం స్పందన అంతంత మాత్రంగా ఉండడంతో విధిలేని పరిస్థితుల్లో ఈ రంగంపై ఆధారపడి కుటుంబాలు నెట్టుకొస్తున్నాయి .

అయితే లాక్‌డౌన్‌ పుణ్యమా అని వీరి పరిస్థితి మరింత దయనీయంగా మారింది చేతిలో పని ఉన్నా నేసిన ఉత్పత్తులను కొనే వారు లేక నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన రెండు నెలలుగా కనీసం కుటుంబం పోషణకు సరిపడా ఆదాయం రాక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కరోనా వైరస్ నుంచి చేనేత రంగం ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేవని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మినహాయింపులు ఇచ్చినా చేనేత రంగం ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి నెలకొందన్నారు తక్షణం ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories