ఆర్డినెన్స్‌పై సర్కారుకు టీఎస్‌ హైకోర్టు నోటీసులు

ఆర్డినెన్స్‌పై సర్కారుకు టీఎస్‌ హైకోర్టు నోటీసులు
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లలో, వేతనాలలో కోత విధిస్తూ ఆర్డినెన్స్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లలో, వేతనాలలో కోత విధిస్తూ ఆర్డినెన్స్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆర్డినెన్స్‌ సవాలు చేస్తూ విశ్రాంత డీఎఫ్‌వో రామన్‌గౌడ్‌ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఒక్క రాత్రిలోనే ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వాదించారు. పిటిషనర్‌ వాదనలు విన్న హైకోర్టు ఆ పిటిషన్ ను పరిశీలించి ఆర్డినెన్స్ పై తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆర్డినెన్స్‌పై 3 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ డిజాస్టర్ అండ్ హెల్త్ ఎమజెన్సీ అర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకువచ్చింది. విపత్కర పరిస్థితిలో ఉద్యోగులకు పాక్షికంగాకాని, పూర్తిగాకాని వేతనాన్ని చెల్లించకుండా నిలుపుదల చేసే వేసులు బాటు కల్పించే నిమిత్తం తెలంగాణ డిజాస్టర్ అండ్ హెల్త్ అర్డినెన్స్ అర్డినెన్స్ ను తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ అర్డినెన్స్ పెన్షన్ దారులకు కూడ వర్తించనుంది. ప్రస్తుతం పిన్షన్ దారులకు 25 శాతం, ఉద్యోగులకు 50 శాతం వేతానాల్లో ప్రభుత్వం కొత విధించింది. ఇక ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పెన్షన్ దారులు హైకోర్టును అశ్రయించడంతో ఎలాంటి కొత విధించకుండ పెన్షన్ చెల్లించాలని హైకోర్టు కొరిన దరిమిళ ప్రభుత్వం ఈ అర్డినెన్స్ ను తీసుకురావాడం ప్రాథన్యత సంతరించుకుంది. ఉద్యోగులు కూడ ఇటివల సియస్ ను కలిసి పూర్తి వేతాన్ని చెల్లించాలని విజ్జాప్తి చేశారు. ఈ లాంటి సమయంలో ప్రభుత్వం అర్డినెన్స్ ను తీసుకురావడం మరికొంత కాలం వేతనాలు చెల్లించలేమని స్పష్టం చేయ్యడమే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories